: క్లింటన్, నా మధ్య పరస్పర అంగీకార సంబంధమే: మోనిక


అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్ తో తనకున్న సంబంధంపై మోనికా లూయిన్ స్కీ మనసు విప్పారు. 1999లో క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయం (వైట్ హౌస్)లో ఆమె పని చేశారు. అప్పట్లో వీరి మధ్య లైంగిక సంబంధంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై తాజాగా మోనికా వానిటీ ఫెయిర్ మేగజైన్ కు ప్రత్యేక ఆర్టికల్ రాశారు. క్లింటన్ కు, తనకు మధ్య అప్పట్లో ఉన్నది పరస్పర అంగీకార సంబంధమేనని ఆమె తెలిపారు. తమ మధ్య జరిగిన దానిపై తీవ్రంగా విచారిస్తున్నానని ఆమె అందులో పేర్కొన్నారు. తమ మధ్య ఇద్దరు పెద్దవాళ్ల మధ్య ఉండే సంబంధమే నడిచిందని, బాస్ (క్లింటన్) అవకాశం తీసుకున్నాడని వెల్లడించారు. 'నా గతం, ఇతరుల భవిష్యత్తుపై చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చింది' అని చెప్పారు.

  • Loading...

More Telugu News