: శ్రీకాకుళంలో టీడీపీ-వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
శ్రీకాకుళంలోని బాలికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం ఆవరణలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ పద్మావతి ప్రచారం చేశారు. ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. దాంతో టీడీపీ-వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.