: ల్యాంకో హిల్స్ పై కేసు నమోదు


ల్యాంకో హిల్స్ యాజమాన్యంపై రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్ శివారు మణికొండలో ప్రభుత్వ భూమిని ల్యాంకో హిల్స్ తమ డంపింగ్ యార్డ్ గా ఉపయోగిస్తోందని రాజేంద్ర నగర్ తహసీల్దారు ఫిర్యాదు చేశారు. దీంతో ల్యాంకోపై 427, 447 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భూమిని డంపింగ్ యార్డ్ గా ఉపయోగించుకోవడంపై 15 రోజుల కిందటే నోటీసులు ఇచ్చినా ల్యాంకో యాజమాన్యం స్పందించలేదని, అందుకే చర్యలు తీసుకున్నామనీ తహసీల్దారు చెప్పారు.

  • Loading...

More Telugu News