: సబ్బంహరికి నోటీసు జారీ చేస్తాం: భన్వర్ లాల్


పోలింగ్ కు ఒక్క రోజు సమయం మిగిలి ఉండగా ఇవాళ జై సమైక్యాంధ్ర పార్టీ ఎంపీ అభ్యర్థి సబ్బం హరి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. అయితే, ఒక పార్టీ నుంచి పోటీ చేస్తూ, మరో పార్టీకి మద్దతునివ్వడం సరికాదని... నిబంధనల ప్రకారం సబ్బం హరికి నోటీసు జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులను డమ్మీ అభ్యర్థులుగా పరిగణించనున్నట్లు భన్వర్ లాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News