: టీవీ ఛానెళ్లపై పరువు నష్టం దావా వేస్తాం: పార్థసారధి


పత్రికా విలువలు తొక్కిపెట్టి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అభ్యర్థి పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న టీవీ ఛానెళ్లపై పరువు నష్టం దావా వేస్తానని మాజీ మంత్రి పార్థసారధి అన్నారు. పోలీసులు జరిపిన సోదాల్లో తనకు సంబంధించిన ఒక్క రూపాయి కూడా దొరకలేదని ఆయన తెలిపారు. బీసీకి చెందిన వాడిని కనుకే తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తానున్న హోటల్ లోనే బస చేసిన టీడీపీ నేతలు డబ్బు సంచులతో బయటికెళ్లిన సాక్ష్యాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News