: ఏపీలో ఎన్నికలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి: ఈసీ రాష్ట్ర ఇన్ ఛార్జ్
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయని ఎన్నికల సంఘం రాష్ట్ర ఇన్ ఛార్జ్ వినోద్ అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డబ్బు, మద్యం ప్రవహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దేశంలో పట్టుబడిన మొత్తం డబ్బు, మద్యంలో ఏపీలోనే ఎక్కువ దొరికిందని చెప్పారు. నిబంధనలను అతిక్రమించిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.