: 131 కోట్ల డబ్బు, 90 కేజీల బంగారం దొరికింది: డీజీపీ
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో 131.2 కోట్ల రూపాయల డబ్బు స్వాధీనం చేసుకున్నామని, అందులో 45 కోట్ల రూపాయలకు లెక్కలు ఉండడంతో ఆ మొత్తాన్ని యజమానులకు అందజేసి మిగిలిన మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు అందజేశామని తెలిపారు. కోటి లీటర్ల మద్యం ఉందని ఆయన వెల్లడించారు.
90 కేజీల అక్రమ బంగారం, 825 కేజీల వెండి లభ్యమయ్యాయని ఆయన చెప్పారు. అలాగే ఎన్నికల సందర్భంగా 5,938 కేసులను నమోదు చేశామని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల వివిధ దళాలకు చెందిన భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నామని ఆయన వివరించారు. ఎన్నికల సందర్భంగా 4 హెలికాప్టర్లను కూడా వినియోగించనున్నామని ఆయన తెలిపారు.