: సబ్బం హరిపై నిప్పులు చెరిగిన కొత్తపల్లి గీత


సబ్బం హరిపై అరకు వైఎస్సార్ కాంగెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నిప్పులు చెరిగారు. పలానా పార్టీకి ఓటేయండంటూ జై సమైక్యాంధ్ర పార్టీ నేత సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని ఆమె అన్నారు. సబ్బంహరిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని గీత డిమాండ్ చేశారు. ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆమె అన్నారు. ఆయన నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారని గీత చెప్పారు.

  • Loading...

More Telugu News