: దేశవ్యాప్తంగా ఎనిమిదో దశ పోలింగ్ రేపే
రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతంలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో రేపు పోలింగ్ జరుగనుంది. దేశవ్యాప్తంగా 64 లోక్ సభ స్థానాలకు రేపు పోలింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ (25), ఉత్తరప్రదేశ్ (15), బీహార్ (7), పశ్చిమ బెంగాల్ (6), ఉత్తరాఖండ్ (5), హిమాచల్ ప్రదేశ్ (4), జమ్మూ కాశ్మీర్ (2)లలో రేపు ఎనిమిదో దశ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడు దశల్లో 438 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తి అయింది. సుమారు 66 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో రెండు విడతల్లో జరిగే పోలింగ్ తో దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి కానున్నాయి.