: ఆస్తమాకు ఎండతో చెక్


ఆస్తమా లక్షణాలతో బాధపడేవారికి సూర్యరశ్మి చక్కగా తోడ్పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణంగా ఆస్తమా రోగుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, విటమిన్ డీ లోపం కూడా ఉంటుందని... అలాంటి వారు తగినంత సూర్యరశ్మిని పొందడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి బలం పుంజుకుంటుందని ఫోర్టిస్ హాస్పిటల్ పల్మనరీ విభాగం డైరెక్టర్ వివేక్ నంజియా తెలిపారు. సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డీ లభిస్తుందని, ఇది తీవ్రమైన ఆస్తమా లక్షణాలను నియంత్రిస్తుందని ఆయన తెలిపారు. విటమిన్ డీ రోగనిరోధక శక్తిని చురుగ్గా చేయడానికి సహకరిస్తుందని లండన్ లోని కింగ్స్ కాలేజీ పరిశోధకుల అధ్యయనంలోనూ వెల్లడైంది.

  • Loading...

More Telugu News