: పోటీ నుంచి తప్పుకుంటున్నా... ఎన్డీఏ కూటమికి ఓటేయండి: సబ్బం హరి


తాను ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నానని విశాఖ లోక్ సభ జేఎస్పీ అభ్యర్థి సబ్బం హరి స్పష్టం చేశారు. అరాచక శక్తులు అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజనకు మించిన అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. జగన్ పార్టీకి ఓటు వేస్తే వినాశనం తప్పదని అన్నారు. ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తెస్తే... రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని ఓటర్లకు సూచించారు. విశాఖలో విజయమ్మ గెలవకుండా ఉండాలంటే... ఓట్లు చీలకూడదని... అందుకే తాను బరి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. గతంలో తాను చెప్పినవన్నీ జరిగాయని... అందుకే ఇప్పుడు కూడా చెబుతున్నానని... వైకాపా అధికారంలోకి రాదని తెలిపారు.

  • Loading...

More Telugu News