: బాలికల పాఠశాలపై పెట్రోలు బాంబు దాడి


కాశ్మీర్లోని రఫియాబాద్ ప్రభుత్వ బాలికల పాఠశాలపైకి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు బాంబు విసిరారు. బారాముల్లా లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా బుధవారం రఫియాబాద్ లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రానికి సమీపంలోని పాఠశాలలో బాంబు పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పాఠశాల భవనం స్వల్పంగా దెబ్బతిందని పోలీసులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News