: శిల్పాశెట్టికి ఆ గుర్తింపే ముఖ్యమట
నటి నుంచి వ్యాపారవేత్తగా మారిపోయిన శిల్పాశెట్టి(38)... తాను నటిగానే గుర్తింపును కోరుకుంటున్నానని అంటోంది. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ప్రముఖ వ్యాపారి అన్న విషయం తెలిసిందే. భర్తతో కలసి వ్యాపారంలో చురుగ్గా పాలు పంచుకుంటోంది. అయితే, తాను నటిగానే ముందు అందరికీ పరిచయం అని, పెళ్లయిన తర్వాతే వ్యాపారంలోకి అడుగుపెట్టానని తెలిపింది. షూటింగుల కోసం కుటుంబాన్ని విడిచి ఎక్కువ రోజుల పాటు వెళ్లడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యాపారంలో మన కింద ఎంతో మంది పని చేస్తుంటారని, అదే సినిమాలో అయితే, మన పాత్రను మనమే నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొంది.