: జాగ్రత్త...కారు బాంబులతో విరుచుకుపడతారు


దేశంలోని అన్ని విమానాశ్రయాలకు బాంబు దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. కారు బాంబులతో తీవ్రవాదులు విరుచుకుపడే అవకాశం ఉందంటూ దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని విమానాశ్రయాలకు భద్రతను పెంచటంతో పాటు ఆంక్షలు విధించాలని సూచించింది.

దీంతో ఉన్నతాధికారులు హైదరాబాద్ సహా అన్ని ఎయిర్‌పోర్ట్‌లకు భద్రతను పెంచారు. హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అన్ని విమానాశ్రయాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో అనువణువూ సోదాలు నిర్వహిస్తున్నారు. విమానాశ్రయ పరిసరాల్లో రోజుల కొద్దీ పార్క్ చేసిన వాహనాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News