: వైకాపా అభ్యర్థి బెదిరిస్తున్నాడంటూ ఓటర్ల ఆందోళన
విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి గండి బాబ్జి తమను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపాకు ఓటు వేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అంతుచూస్తామని బెదిరించారని అంబేద్కర్ నగర్ నిర్వాసితుల కమిటీ కార్యదర్శి నిర్మల వాపోయారు. ఈ బెదిరింపులకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.