: విశ్రాంతి లేకపోయినా...ఉత్సాహం పెరిగింది: మోడీ
గత కొంత కాలంగా విశ్రాంతి లేకపోయినప్పటికీ, ప్రజల అభిమానం చూస్తుంటే ఉత్సాహం పెరిగిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలిపారు. అహ్మదాబాద్ లో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ నెల రోజుల కాలంలో పుస్తకాలు ఏవన్నా చదివారా? సంగీతం విన్నారా? అని అడిగిన ప్రశ్నలకు, ప్రస్తుతానికి ప్రజా సమస్యలను చదువుతున్నానని తెలిపారు.
తనకు విశ్రాంతి తీసుకునే సమయం లేదని, ప్రస్తుతానికి మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నానని, రానున్న రోజుల్లో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మరింత శ్రమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈమధ్య ఒకసారి సంగీతం విన్నానని, ఇకపై అది కూడా వినకుండా ప్రజల కోసం శ్రమిస్తానని మోడీ వెల్లడించారు.