: ధ్యానం మనుషులుగా తీరుస్తుంది


పక్కవాడికి సాయపడితేనే మనం మనుషులం. ఎవరి బతుకు వారే బతికేట్లయితే పురుగులకు, మనకు తేడా ఉండదు. జంతువులతో పోల్చడానికీ వీల్లేదు. ఎందుకంటే జంతువుల్లో కూడా పక్కవాటికి సాయపడే గుణం ఎక్కువ. అయితే , ఇదే మనిషి లక్షణం అనుకుంటే గనుక.. భారతీయ ఆధ్యాత్మిక ధర్మం ప్రతిపాదించే ధ్యానం అనే ప్రక్రియ.. ఈ లక్షణాన్ని మరింత పెంచుతుందిట. కాకపోతే.. ఈ సత్యాన్ని అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం వారు కనుక్కొన్నారు. 

వారు ఒక సమూహాన్ని సెలక్టు చేసుకుని వారికి రెండు ధ్యానపద్ధతుల్లో శిక్షణ ఇచ్చి ప్రవర్తనను పరిశీలించారట. పద్ధతి ఏదైనా
ధ్యానం చేసేవారిలో పరోపకారగుణం, ఇతరుల బాధల పట్ల స్పందించడం పెరుగుతోందట. దాంతో ధ్యానం అద్భుతం బాబోయ్‌.. అది మన వ్యక్తిత్వాన్ని తీరుస్తుంది అంటూ వాళ్లు.. మనకు తెలిసిన సత్యాన్నే మళ్లీ ప్రకటిస్తున్నారు. 

  • Loading...

More Telugu News