: పవన్ కల్యాణ్ తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడమేమిటి?: తమ్మారెడ్డి భరద్వాజ
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న పవన్ కల్యాణ్ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. జంప్ జిలానీలకు జనసేన పార్టీలో స్థానం లేదని చెప్పిన పవన్ కల్యాణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారితో నిండిపోయిన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఎలా పలికారని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారని, ఇప్పుడు అధికారం కోసం బాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానంటున్నారని భరద్వాజ విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తూ బాబు ప్రజలను మోసగిస్తున్నారంటూ ఆయన నిప్పులు చెరిగారు.