: చంద్రబాబు 'ఆల్ ఫ్రీ బాబు' అయితే... జగన్ 'ఆల్ రాబరీ బాబు': యనమల
టీడీపీ అధినేత చంద్రబాబును ఆల్ ఫ్రీ బాబు అని విమర్శిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్, 'ఆల్ రాబరీ బాబు' అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాదని గ్రహించిన జగన్, ఏదో విధంగా కేసుల్లోంచి బయటపడేందుకు మోడీకి మద్దతు ప్రకటించారని అన్నారు. రాష్ట్రంలో భూములు, గనులు, నీళ్లు, సహజ వనరులన్నింటినీ దోచేసిన జగన్, ఆల్ రాబరీ బాబుగా పేరుగాంచారని ఆయన విమర్శించారు.