: టీఆర్ఎస్ తో పొత్తు అవసరం లేదు: పొన్నాల
టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే అవసరం లేదని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిందని చెబితే ప్రజలు నమ్ముతారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 10న ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీటీసీ అభ్యర్థులతో, 11న మున్సిపల్ అభ్యర్థులతో సమావేశమవుతానని పొన్నాల తెలిపారు.