: ఆ మూడు పార్టీలు ఇక్కడ వేర్వేరు... ఢిల్లీలో మాత్రం ఒక్కటైపోతాయి: మోడీ
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ వేర్వేరుగా ఉంటాయని, ఢిల్లీలో మాత్రం ఆ మూడు పార్టీలు కలసిపోతాయని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ... మోసం, కుట్ర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ను ఓడించాలన్నారు. కాంగ్రెస్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఊపిరి ఉన్నంత వరకు అవినీతిపై పోరాడుతానని ఆయన అన్నారు.