: కడప నుంచి 300 మంది రౌడీలు విశాఖలో దిగారు: శశిధర్ రెడ్డి
కడప నుంచి 300 మంది రౌడీలు విశాఖలో దౌర్జన్యానికి వచ్చారనే ప్రచారం జరుగుతోందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, 2009లో వంద కోట్ల రూపాయలు ఉన్న జగన్ వేల కోట్ల రూపాలు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ ఎలా సంపాదించాలనే విద్యను ప్రజలకు జగన్ నేర్పాలని ఆయన కోరారు. అధికారంలోకి వస్తే లక్షాధికారులను చేస్తాం, కోటీశ్వరులను చేస్తామని హామీలు ఇస్తున్న జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. ప్రజల కష్టాలు తీర్చాలంటే కాంగ్రెస్ లాంటి జాతీయపార్టీ అధికారంలోకి రావాలని ఆయన తెలిపారు.