: పాక్ వ్యతిరేక నినాదాలు చేయనందుకు తన్నులు
ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో కాశ్మీరీ విద్యార్థులపై దాడి జరిగింది. నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలోని హాస్టల్లో ఇది జరిగింది. భారత్ మాతాకీ జై అనాలని, పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేయాలని ఇతర విద్యార్థులు కొందరు కోరినట్లు సమాచారం. అందుకు జమ్మూ కాశ్మీర్ కు చెందిన విద్యార్థులు నిరాకరించారు. దాంతో కాశ్మీరీ విద్యార్థులను కొట్టారు. అయితే, వర్సిటీలో ఇలాంటి గొడవలు సాధారణమేనని, జాతి వ్యతిరేక దాడులుగా వీటిని చూడవద్దని అధికారులు అంటున్నారు. దీనిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ ను నోయిడా యూనివర్సిటీకి పంపి వాస్తవాలు తెలుసుకున్నాక తదుపరి చర్యలు చేపడతామన్నారు.