: షారూఖ్ చిందులు.. మమత మెచ్చుకోళ్ళు


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో ఓ ఊపు ఊపేశాడు. 'కుచ్ కుచ్ హోతా హై' అంటూనే భారీ ఎత్తున వినోదం పంచాడు. ఈ కింగ్ ఆఫ్ బాలీవుడ్ స్టేజ్ పై ప్రదర్శన సాగిస్తుండగా వీఐపీల వరుసలో ఆసీనురాలైన పశ్చిమ  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసాపూర్వకంగా కరతాళ ధ్వనులతో ప్రోత్సహించడం కనిపించింది. తొలుత డాన్ గీతంతో వేదికపైకి వచ్చిన షారూఖ్ తన హిట్ చిత్రాల్లోని సూపర్ హిట్ గీతాలకు కనులవిందుగా నర్తించాడు. కాగా, ఈ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహణ బాధ్యతలు షారూఖ్ కు చెందిన రెడ్ ఛిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News