: 'దబాంగ్', 'సింగమ్' ప్రోమోలతో యువతను ఆకర్షిస్తున్న కోచింగ్ సంస్థలు


బాలీవుడ్ హిట్ చిత్రాలు 'దబాంగ్', 'సింగమ్' లను ఇప్పుడు పోలీసు విభాగంలో యువత చేరేందుకు ఉపయోగిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ తమదైన శైలిలో పోలీసు పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలానే జైపూర్ లోని కొన్ని కోచింగ్ సంస్థలు ఈ సినిమాల ప్రోమోలను, ఫోటోలను యువతలో ధైర్యం, స్పూర్తి నింపేందుకు చూపిస్తున్నాయట. అలా పలువురు యువకులు పోలీస్ విభాగంలో చేరుతున్నారట కూడా. ఈ క్రమంలో ఇటీవల ఆ రాష్ట్ర సబ్ ఇన్ స్పెక్టర్ల పోస్టుల్లో నియామకాలు జరిగాయట. అంతేకాదు, జూన్ 1న కానిస్టేబుళ్ల రిక్రూట్ మెంట్ చేపడుతున్నారట.

  • Loading...

More Telugu News