: అజంగఢ్ ఉగ్రవాదుల స్థావరం: అమిత్ షా


బీజేపీ నేత అమిత్ షా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని అజంగఢ్ స్థానాన్ని ఉగ్రవాదుల స్థావరంగా పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి తరపున అమిత్ షా నిన్న అజంగఢ్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగ్రవాదులు అజంగఢ్ ను తమ ప్రధాన స్థావరం చేసుకుని దేశంలోని ఇతర ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న అఖిలేశ్ సర్కారును దించివేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు.

  • Loading...

More Telugu News