: కేసీఆర్ పై కావాలని బురదజల్లుతున్నారు: కేఎస్ రత్నం
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కావాలని కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేత కేఎస్ రత్నం ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దళిత సీఎం అంశంపై కేసీఆర్ ను అందరూ నిలదీస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో అమలు కావాలంటే కేసీఆర్ సీఎం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం ఎవరన్నది తమ పార్టీ ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు.