: లగడపాటికి, పది టీవీ ఛానెళ్లకు నోటీసులు: భన్వర్ లాల్
ఆఖరి విడత ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ పై నిషేధం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఒపీనియన్ పోల్స్ వెల్లడించిన లగడపాటి, ఆయన ప్రెస్ మీట్ ప్రసారం చేసిన పదికి పైగా టీవీ ఛానెళ్లకు నోటీసులు జారీ చేశామని అన్నారు. కారులో దగ్ధమైన డబ్బు విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేసుపెడతామని ఆయన స్పష్టం చేశారు.