: హిందూపురాన్ని చుట్టేస్తున్న బాలయ్య భార్య, కుమార్తె
అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర, చిన్న కుమార్తె తేజశ్విని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. హిందూపురంలో బాలయ్య మాట్లాడుతూ, హిందూపురం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, తాగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. మరో వైపు టీడీపీ ఇచ్చిన హామీలు ప్రజల్లోకి తీసుకెళ్తూ బాలయ్య భార్య ఒకవైపు, బాలయ్య చిన్న కుమార్తె తేజశ్విని మరోవైపు ప్రచారం నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నందమూరి కుటుంబంపై హిందూపురం ప్రజలు చూపిస్తున్న అభిమానం ఎనలేనిదని వారు అభిప్రాయపడ్డారు.