: వడగళ్ల వానకు 3 వేల క్వింటాళ్ల వరి నాశనం
అకాల వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భానుడి ప్రతాపం నుంచి ఊరటనిచ్చేందుకు వచ్చిన వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన ధాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన 3 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దైంది. వెయ్యి ఎకరాల్లో మామిడి, 300 ఎకరాల్లో వరి, నువ్వులు, కూరగాయల పంటలు నేలకొరిగి నాశనమయ్యాయి.