: విజయమ్మ గెలిస్తే... ఉత్తరాంధ్ర ఫ్యాక్షన్ బారిన పడుతుంది: యనమల


టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ అక్రమాస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. సీమాంధ్రలో అభివృద్ధికి 9 అంశాల పేరుతో జగన్ విడుదల చేసిన బ్లూప్రింట్ ఓ బోగస్ బ్లూప్రింట్ అని విమర్శించారు. గతంలో టీడీపీ విడుదల చేసిన 'స్వర్ణాంధ్ర నిర్మాణానికి నవరత్నాలు'ను వైకాపా మక్కీకిమక్కి కాపీ కొట్టిందని ఆరోపించారు. విశాఖలో విజయమ్మ గెలిస్తే... ఉత్తరాంధ్ర మొత్తం ఫ్యాక్షన్ రాజకీయాల బారిన పడుతుందని హెచ్చరించారు. ఈరోజు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News