: జగన్ ముఖ్యమంత్రి కావడం కల్ల: చిరంజీవి
కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకొని, అన్నీ తానై ప్రచారంలో మునిగిపోయారు. కాంగ్రెస్ నుంచి సీనియర్లు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడంతో ఆ పార్టీలో ఇప్పుడు ముఖ్య నేతలే లేకుండా పోయారు. దాంతో చిరంజీవి సీమాంద్ర ప్రాంతంలో ఇప్పుడు ఆ పార్టీకి ఏకైక దిక్కయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చిరంజీవి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా ఇవాళ విజయనగరం జిల్లా కొండ తామరాపల్లి సెంటర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చిరంజీవి మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబును జనం నమ్మటం లేదని, ఆయనకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని చిరంజీవి అన్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిపోయినట్టు ఫీలవుతున్నారని, ఆయన ఐదు సంతకాలతో రాష్ట్ర దశ, దిశ మార్చేస్తానంటున్నారని చిరంజీవి ఎద్దేవా చేశారు.