: అసోంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు


అసోంలోని బోడో ప్రాంతాలైన కొక్రాఝర్, బస్కా, చిరాంగ్ జిల్లాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బోడో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న దుండగులు సాధారణ పౌరులను కాల్చివేయడంతో అలర్లు చెలరేగాయి. దీంతో అసోంలో నిరవధిక కర్ఫ్యూ విధించారు. అదనపు భద్రత కోసం కేంద్రం 10 కంపెనీల పారామిలటరీ బలగాలను రాష్ట్రానికి పంపింది. హింస జరిగిన ప్రాంతాల్లో సైన్యం కవాతు నిర్వహించింది.

ఈ పరిస్థితికి బాధ్యత వహిస్తున్నట్టు అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ప్రకటించారు. అయితే తాను పిరికి పందలా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పారిపోనని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2012లో కూడా బోడోలు, ముస్లింల మధ్య జరిగిన జాతుల ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News