: సీమాంధ్రలో ఎన్నికలకు అన్నీ సిద్ధం చేశాం: భన్వర్ లాల్


ఈ నెల 7న ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ప్రతి ఇంటికీ ఓటరు స్లిప్ లను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ మేరకు హైదరాబాదులో మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 40,788 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఎనిమిది నియోజక వర్గాల్లో ఐదు గంటలవరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. అరుకు, పాడేరులో ఉదయం 7 గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. 165 నియోజక వర్గాల్లో ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు భన్వర్ లాల్ వెల్లడించారు.

పోలింగ్ కేంద్రాల్లో కనీస అవసరాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటరు జాబితాలో పేరుంటే ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లు స్లిప్పులు తీసుకోవచ్చని భన్వర్ లాల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News