: రేపు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు
రేపు రాయలసీమలోని జిల్లాలలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో బాబు ప్రచారాన్ని కొనసాగిస్తారు. ఆదివారం ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి బద్వేల్ చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు బద్వేల్ లోనూ, మధ్యాహ్నం 12.45కి ప్రొద్దుటూరులో జరిగే బహిరంగసభల్లో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం కదిరి, పీలేరు, పుంగనూరు, కుప్పం, పలమనేరు సభల్లో ఆయన మాట్లాడుతారు. చివరగా రాత్రి 9 గంటలకు చిత్తూరులో జరిగే బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.