: సీమాంధ్రకు రెండు ఉపముఖ్యమంత్రి పదవులు: చంద్రబాబు
సీమాంధ్రలో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఏర్పాటు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక బీసీలకు, కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న బాబు పై విధంగా హామీ ఇచ్చారు.