: సీమాంధ్రుల ఆత్మ గౌరవం కాపాడే ప్రయత్నం జగన్ చేయలేదు: పవన్
ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఎస్ జగన్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. అతని అధికార దాహం కోసమే రాష్ట్రం ముక్కలైందన్నారు. తండ్రి మరణించగానే సీఎం పదవికోసం జగన్ ఆరాట పడ్డాడని ఆరోపించారు. తల్లిదండ్రులను కష్టపడకుండా చూడటం మనకు తెలిసిన న్యాయం అన్న పవన్, అధికారం కోసం తన తల్లిని రోడ్డుమీద తిప్పుతున్నాడని వ్యాఖ్యానించారు. తల్లిని కష్టపెట్టేవాడు రాష్ట్రానికేం న్యాయం చేస్తాడని అడిగారు. ఇక సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవం కాపాడే ప్రయత్నం జగన్ ఏనాడు చేయలేదని మండిపడ్డారు. సీమాంధ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసే కేసీఆర్ ను జగన్ ఏమీ అనడెందుకు? అని పవన్ ప్రశ్నించారు. సీమాంధ్రులను కించపరిచేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని, భారతదేశ జాతిని, సమగ్రతను చెడగొట్టొద్దని సూచించారు. కీలక తరుణంలో 2014 ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.