: తల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలను ఓడించండి: కేఏ పాల్
రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ను ఓడించాలని ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. అవినీతిపరులకు ఓటు వేయవద్దని పాల్ చెప్పారు. ఇవాళ విశాఖపట్నంలో పాల్ మీడియాతో మాట్లాడుతూ... కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయితేనే దేశాభివృద్ధి సాధ్యమని పాల్ స్పష్టం చేశారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పాల్ చెప్పారు.