: జగన్ పై చిరంజీవి విమర్శల దాడి
శాశ్వతంగా జైల్లో ఉండాల్సి వస్తుందనే వైఎస్ జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని కేంద్ర మంత్రి చిరంజీవి ఆరోపించారు. అధికారం ఉంటే తప్పించుకోవచ్చని ఆయన అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తిలో చిరు మాట్లాడుతూ, వైసీపీకి ఓటు వేస్తే దోపిడీ పాలనేనని అన్నారు. తండ్రి శవాన్ని దగ్గర పెట్టుకుని సీఎం పదవి కోసం జగన్ తప్పటడుగు వేశారన్నారు. లక్షల కోట్లు లూటీ చేసిన జగన్ కు ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.