: కొడుకు కోసం కలిసిన హృతిక్, సుజానే


విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న బాలీవుడ్ జంట హృతిక్ రోషన్, సుజానేలు మళ్లీ కలిశారు. విడివిడిగా ఉంటున్న వీరు తమ చిన్న కొడుకు హృదాన్ కోసం కలుసుకుని పార్టీ చేసుకున్నారు. హృదాన్ పుట్టినరోజు కోసం హృతిక్ రోషన్ షూటింగ్ కి సెలవుపెట్టి, సుజానే ఉంటున్న లోనావాలా ఇంటికి వెళ్లాడు. అక్కడ గ్రాండ్ గా పార్టీ చేసుకున్న తర్వాత అందరూ కలిసి ముంబై వచ్చి, జుహూ లోని ఓ మల్టీప్లెక్సులో సినిమా చూశారు. హృతిక్ కుటుంబంతో పాటు హృదాన్ మిత్రబృందం కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. విడిపోయేందుకు సిద్ధమయినా, పిల్లల కోసం తమ పట్టు వీడిన హృతిక్, సుజానేలను సన్నిహితులు అభినందిస్తున్నారు.

  • Loading...

More Telugu News