: స్టూడియో కోసమో, బ్లడ్ బ్యాంకు కోసమో నేనెవరికీ మద్దతు తెలపలేదు: రాజశేఖర్
తాను స్టూడియో కోసమో, బ్లడ్ బ్యాంకు కోసమో నేతలకు మద్దతు పలకలేదని సినీ నటుడు రాజశేఖర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వైఎస్ కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్లలేదని అన్నారు. ఉత్తమ అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఓటర్లు ఒక్కోసారి ఒక్కో అభ్యర్థికి ఓటేస్తారని, ఓటర్లు అలా చేయడం తప్పయితే తాను వేర్వేరు పార్టీలకు మద్దతు తెలపడం కూడా తప్పేనని ఆయన తెలిపారు. తాను బీజేపీలో చేరలేదని, జీవిత చేరిందని ఆయన వెల్లడించారు. కేసీఆర్, పవన్ కల్యాణ్ బహిరంగంగా తిట్టుకోవడం బాగోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.