: డిగ్గీ-అమృతా కంటెంట్ ను బ్లాక్ చేయండి.. వెబ్ సైట్లను కోరిన పోలీసులు
కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్, టీవీ యాంకర్ అమృతారాయ్ కలసి ఉన్న ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తుండటంతో ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు వారిద్దరికి సంబంధించిన కంటెంట్ ను వెంటనే బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ లకు వారు లేఖలు రాశారు. అంతేగాక ఇటీవల రోజుల్లో సదరు యాంకర్ ఈ మెయిల్ ను వినియోగించిన ఐపీ అడ్రస్ ల వివరాలను తెలపాలంటూ పోలీసులు గూగుల్ ను అడిగారు. దానిపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. కేసుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వివరాలు, సాక్ష్యాలు సేకరిస్తున్నామని తెలిపారు.
మరోవైపు గూగుల్, ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, ఓ మీడియా సంస్థకు రాయ్ లీగల్ నోటీసు పంపింది. తను, దిగ్విజయ్ కలసి ఉన్న ఫోటోలను చూపడం ఆపాలని కోరింది.