: పూనంపాండేకు పోలీసుల వార్నింగ్
బాలీవుడ్ నటి, శృంగార తార, తరచూ సంచలన ప్రకటనలు చేసే పూనంపాండేకు ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆమెను నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం ఇకపై ఇలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి విడిచి పెట్టారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే బట్టలిప్పేస్తానంటూ పూనమ్ లోగడ మన క్రికెటర్లకు జోష్ నిచ్చిన విషయం తెలిసిందే.