: ఆంధ్రవాళ్లకోసం ప్రాణాలైనా అర్పిస్తాం : సర్వే
కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ, ఆంధ్రావాళ్లకోసం ప్రాణాలైనా ఇస్తానన్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రవాళ్లను వెళ్లగొడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. అంతేకాదు, తెలంగాణ ఏర్పాటు గురించి సర్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇవ్వడం ద్వారా వేరే పార్టీలకు లబ్ది చేకూరుతుందనుకుంటే ఎందుకు తెలంగాణ ఇస్తాం..? అంటూ మంత్రి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వ్యాఖ్యానించారు.