: రేపు చంద్రబాబు త్రీడీ ప్రచారం వివరాలు...!
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో త్రీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలిసారి వినియోగించుకోనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రచార ఉద్ధృతిని పెంచనున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు, కడప జిల్లా రైల్వేకోడూరు, చిత్తూరు జిల్లా చంద్రగిరి, పలమనేరు, నియోజకవర్గాల్లో ఆయన మాట్లాడనున్నారు.
గుంటూరు జిల్లా పెదకూరపాడు, కృష్ణా జిల్లా పెడన, మైలవరం, ప్రకాశం జిల్లా కొండేపి, తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గాల్లో త్రీడీ పరిజ్ఞానం ద్వారా చంద్రబాబు ప్రసంగించనున్నారు.