: సీమాంధ్రకు వరాల జల్లు కురిపించిన సోనియా


గుంటూరు సభలో సీమాంధ్రకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వరాల జల్లు కురిపించారు. సీమాంధ్రకు సౌకర్యాలు కల్పించే అంశాలను విభజన బిల్లులో పొందుపరిచామని చెప్పిన సోనియా... హైదరాబాదు, విద్య విషయంలో పదేళ్లపాటు యథాతథ స్థితి ఉంటుందని చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టు వల్ల లక్షల మందికి లబ్ది కలుగుతుందని తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని, సెంట్రల్, పెట్రోలియం వర్శిటీలు కూడా నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కూడా సభాముఖంగా ప్రకటించారు. అంతేకాక విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు అంతర్జాతీయ స్థాయి కల్పిస్తామని తెలిపారు.

ఇక సీమాంధ్ర ప్రజలు చాలా తెలివైనవారని, కష్టపడే పనిచేసేవారన్న సోనియా ఏపీ అభివృద్ధికి ఇక్కడి ప్రజలు సహకరిస్తారనే నమ్మకం ఉందన్నారు. సీమాంధ్రలోని నగరాలు హైదరాబాదును తలదన్నేలా అభివృద్ధి చెందుతాయని, ఆరోగ్య హక్కుకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. అంతేకాకుండా కాపులు, బలిజలను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News