: సుప్రీంలో హైదరాబాదు జోన్ ఇన్ స్పెక్టర్ల పిటిషన్
పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ హైదరాబాదు జోన్ ఇన్ స్పెక్టర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే విచారణ చేపట్టిన కోర్టు, వ్యక్తిగతంగా తమ ముందుకు హాజరుకావాలంటూ డీజీపీ, ప్రభుత్వ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. గతంలో ఈ సమస్యను పరిష్కరిస్తామని డీజీపీ, ప్రభుత్వ కార్యదర్శి కోర్టుకు తెలిపారు కూడా.