: విక్స్ వెపొరబ్ ప్రకటన తప్పుదోవ పట్టించేదే: ఏఎస్సీఐ


ప్రకటనల ప్రమాణాల విభాగం(ఏఎస్సీఐ) తప్పుదోవ పట్టించే కంపెనీల ప్రకటనలపై మండిపడింది. తనకు వచ్చిన 136 ఫిర్యాదులలో 99 ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేవేనని స్పష్టం చేసింది. ఇందులో ప్రోక్టర్ అండ్ గేంబుల్ కు చెందిన విక్స్ వెపొరబ్ కూడా ఉంది. విక్స్ వెపొరబ్ ప్యాక్ కొనుక్కోవడం ద్వారా 50 రూపాయలు ఆదా చేసుకోండి అని కంపెనీ ఇస్తున్న ప్రకటనను ఏఎస్సీఐ పరిశీలించింది. అదే ప్రకటనలో కింద సూక్ష్మమైన అక్షరాల్లో అసలు విషయాన్ని తెలిసీ తెలియనట్లు చెప్పడం తప్పుదోవ పట్టించడమేనని ఆదేశాలు జారీ చేసింది. డాబర్ కు చెందిన ఫెమ్ ఫెయిర్ నెస్ నేచురల్ బ్లీచ్ ప్రకటన కూడా తప్పుదోవ పట్టించేదేనని కౌన్సిల్ పేర్కొంది. డాబర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గేంబుల్, మారికో ఉత్పాదనలపై ఫిర్యాదులు ఎక్కువగా అందాయి.

  • Loading...

More Telugu News