: కత్తెరతో 39 సార్లు కసిదీరా పొడిచేశాడు


వివాహం చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ ఉన్మాది రెచ్చిపోయి స్నేహితురాలిని కసిదీరా పొడిచేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో ఉండే అనీష్(39) స్నేహితురాలు బల్జీత్ కౌర్(23)ను గత నెల 23న తన ఇంటికి తీసుకెళ్లాడు. వివాహం చేసుకోవాలని కోరాడు. ఆమె నో చెప్పింది. కోపంతో అక్కడే ఉన్న కత్తెర తీసుకుని 39 సార్లు పొడిచేశాడు. దాంతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మొబైల్ కాల్స్ ఆధారంగా ఏడు రోజుల తర్వాత ఆమె మృత దేహాన్ని అనీష్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనీష్ మాత్రం పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News