: మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడికి రిమాండ్
మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ ను రిమాండ్ కు తరలించారు. 2013లో జరిగిన రవి అనే ఉపాధ్యాయుడి హత్య కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నందిగామ పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన కోర్టు కృష్ణప్రసాద్ ను రిమాండ్ కు తరలించింది.